రామ్ చరణ్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల

Mar 27,2025 10:07 #Hero Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్.సి16 ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దీంతో పాటు సినిమా టైటిల్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ లుక్ లో చేతిలో చుట్ట, పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో రామ్ చరణ్ మాస్ లుక్‌‌ లో అలరించారు. రెండవ పోస్టర్ లో ఆయన పాత క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఉన్నట్లు, నేపథ్యంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో ఒక గ్రామీణ గ్రామ స్టేడియం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ పోస్టర్లు సినిమా నేపథ్యం, కథనం గురించి ఉత్సుకతను రేకెత్తించాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. వెంకట సతీష్ కిలారు ఈ సినిమాతో సినీ నిర్మాణ రంగంలోకి నిర్మాతగా అడుగు పెడుతున్నారు.

 

➡️