15న రామ్‌ పోతినేని మూవీ టైటిల్‌ అనౌన్స్‌

ఉస్తాద్‌ రామ్‌ పోతినేని కథానాయకుడిగా టాప్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ మైత్రీ మూవీ మేకర్స్‌లో ఓ సినిమా రూపొందుతోంది. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ విజయం తర్వాత యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ మహేష్‌ బాబు పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మాతలు. హీరోగా రామ్‌ 22వ చిత్రమిది. మే 15న రామ్‌ పోతినేని పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కొత్త సినిమా టైటిల్‌ అధికారికంగా అనౌన్స్‌ చేయడంతో పాటు గ్లింప్స్‌ కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో సాగర్‌ పాత్రలో రామ్‌ పోతినేని, మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే కనిపించనున్నారు. ఈ సినిమాలో రావు రమేష్‌, మురళీ శర్మ, సత్య, రాహుల్‌ రామకష్ణ, వీటీవీ గణేష్‌ నటిస్తున్నారు.

➡️