రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన ‘గేమ్‌ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన అరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (23) మృతిచెందారు. వాళ్ల్లిద్దరూ బైక్‌పై వెళ్తున్న సమయంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు వ్యాన్ ఢకొీట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తన అభిమానులు ప్రమాదంలో మృతిచెందటంపై రామ్‌చరణ్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మృతిచెందిన రెండు కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున రూ.10 లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.