పదకొండు సంవత్సరాల తర్వాత నిర్మాత ఆదిత్య చోప్రా దర్శకుడు విజరు కృష్ణ ఆచార్య కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఈ మిత్ర ద్వయం 2003, 2004లోనే క్రిష్, ధూమ్ సిరీస్‌లు ప్రారంభించింది. ఈ ఫ్రాంచైజీలో నాలుగో సినిమాని తెరకెక్కించేందుకు నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ సిద్ధమవుతోంది. ఈ ఫ్రాంచైజీలు మొదటి రెండు సినిమాలకి కథనందించి మూడో సినిమాని డైరెక్ట్ చేసిన విజరు కృష్ణ ఆచార్య పార్ట్ 4 కోసం పటిష్టమైన కథను సిద్ధం చేశారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌ని లీడ్ రోల్‌లో నటింపజేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద కనిపించని విజువల్స్‌తో భారీ బడ్జెట్‌లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. 2025లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.