కిశోర్‌తో రవితేజ నెక్స్ట్‌ ప్రాజెక్టు

‘సెకండ్‌ హ్యాడ్‌’ మూవీతో దర్శకుడిగా మారిన రచయిత కిశోర్‌ తిరుమలతో రవితేజ ఓ సినిమా చేయబోతున్నారు. కిశోర్‌ ‘నేనూ శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’, ‘రెడ్‌’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి సినిమాలని తెరకెక్కించారు. రవితేజతో తెరకెక్కించే సినిమా జూన్‌ 3న మొదలవు తుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘మాస్‌ జాతర’ సినిమాకి సంగీతం అందిస్తున్న భీమ్స్‌ సిసిరోలియోనే ఈ సినిమాకూ సంగీతం అందించబోతున్నారని సమాచారం.

➡️