నవంబరు నెలాఖరు నుంచి ‘ఆర్‌సి-16’

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్‌, జాన్వీకపూర్‌ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ‘ఆర్‌సి-16’. స్పోర్ట్స్‌ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి కీలకమైన అప్‌ డేట్‌ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమా నవంబర్‌ నెలాఖరు నుంచి సెట్‌ మీదకు వెళ్తోంది. కన్నడ స్టార్‌ హీరో శివ రాజ్‌ కుమార్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్‌ షెడ్యూల్‌ను ముందుగా కర్ణాటక లోని మైసూరులో ప్లాన్‌ చేసారు. అక్కడ దాదాపు 15 రోజులు పాటు షూట్‌ చేయనున్నారు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్‌ సిటీలో కొంత భాగం చిత్రీకరించనునున్నారు. రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది.

➡️