వెబ్‌సిరీస్‌తో రీ ఎంట్రీ

లేడీ కమెడియన్‌గా కోవై సరళ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. రెండు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన కోవై సరళ కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం కోవై సరళ ఓ తెలుగు వెబ్‌ సీరిస్‌లో గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. యువ హీరోయిన్‌ రీతూ వర్మ, శివ కందుకూరి జంటగా నటిస్తున్న ఈ వెబ్‌ సీరీస్‌ ‘దేవిక అండ్‌ డానీ’. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ఇటీవలే రిలీజ్‌ అయింది. రీతూవర్మకు ఇదే మొదటి వెబ్‌ సీరిస్‌. ‘శ్రీకారం’ మూవీ ఫేమ్‌ బి. కిశోర్‌ ఈ వెబ్‌ సీరిస్‌ను తెరకెక్కించారు. అతనితోపాటు ఇందులో సూర్య వశిష్ఠ, సుబ్బరాజు, మౌనికా రెడ్డి, సోనియా సింగ్‌, చాగంటి సుధాకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జరు క్రిష్‌ దీనికి మ్యూజిక్‌ అందించారు. త్వరలో ఈ వెబ్‌ సీరిస్‌ జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

➡️