14న 9 సినిమాల రీ రిలీజ్‌

Feb 11,2024 08:48 #movie
  • ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈనెల 14న గతంలో విడుదలైన తొమ్మిది సినిమాలను రీ రిలీజ్‌ చేస్తున్నారు.

ఆ సినిమాలు ఇవీ : కోలీవుడ్‌ హీరో సూర్య, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ 2008లో విడుదలైన సూపర్‌హిట్‌ మూవీగా నిలిచింది. సూర్య డ్యూయల్‌రోల్‌లో మెప్పించారు. సిద్ధార్థ్‌, శాలిని నటించిన ‘ఓరు’. 2009లో విడుదలైన ఈ సినిమా మంచి లవ్‌స్టోరీగా పేరు తెచ్చుకుంది. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ హీరోహీరోయిన్లుగా నటించి 2022లో వచ్చిన పాన్‌ ఇండియా మూవీ ‘సీతారామం’. ఎమోషనల్‌ లవ్‌ స్టోరీగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించారు. 1998లో కరుణాకరన్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘తొలిప్రేమ’. పవన్‌కళ్యాణ్‌ హీరోగానూ, కీర్తిరెడ్డి హీరోయిన్‌గానూ నటించారు. అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సిద్ధార్థ్‌, త్రిష జంటగా నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, 12 ఏళ్ల క్రితం శర్వానంద్‌, అంజలి జై కాంబినేషన్‌లో వచ్చిన జర్నీ సినిమాలు కూడా ఈనెల 14న రీ రిలీజ్‌ కానున్నాయి. బాలీవుడ్‌లోనూ దిల్‌ వాలే దుల్హనియా లే జాయేంగే, దిల్‌ సో పాగల్‌ హై, మొహబ్బతే వంటి హిట్‌ సినిమాలు రీ రిలీజ్‌ కానున్నాయి.

➡️