దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన ‘విడుదల పార్ట్ 1’కు బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. దీంతో దర్శకుడు పార్టు 2ను తీస్తున్నారు. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘విడుదల 2’ ఫస్ట్‌లుక్‌ను మేకర్లు బుధవారం తెలుగు, తమిళంలో విడుదల చేశారు. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. చిత్ర నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ విడుదల పార్ట్ 1 సినిమాకు మూవీ లవర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి తమ బృందం ఎంతో సంతోషించిందన్నారు. నటుడు సూరికి ఎంతో పేరు తెచ్చిపెట్టిందన్నారు. సేతుపతి నటించిన ‘మహరాజ’ తర్వాత వస్తున్న చిత్రం ‘విడుదల 2’. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఆఖరులో విడుదల చేస్తామని ప్రకటించారు. భవానీ శ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
