1న ‘హిట్‌ 3’ విడుదల

Apr 14,2025 21:25 #actor nani, #Hit 3 movie, #movies

కథానాయకుడు నాని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హిట్‌ 3’. ఈ సినిమాలో అర్జున్‌ సర్కార్‌గా పోలీసు పాత్రలో నాని నటించాడు. మే 1న విడుదల కానున్న ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్లు విడుదల చేశారు. మలయాళంలో గతేడాది వచ్చిన ‘మార్కో’ సినిమాకు మించిన వయలెన్స్‌ హిట్‌-3 ఉంటుందని సమాచారం. ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన వ్యాఖ్యలను నాని పాత్రకు కలుపుతూ ఎలివేషన్స్‌ ఇచ్చారు. ఈ సినిమాకు శైలేష్‌ కొలను దర్శకుడు. శ్రీనిధిశెట్టి కథానాయిక. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్‌ పూర్తిచేసుకొని ఎ సర్టిఫికెట్‌ పొందింది. సినిమా రన్‌టైం 2.35 గంటలు. మిక్కీ జే మేయర్‌ సంగీతాన్ని అందించారు.

➡️