1న ‘హిట్‌ : ది థర్డ్‌ కేస్‌’ విడుదల

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిట్‌ : ది థర్డ్‌ కేస్‌’ మే 1న విడుదల కానుంది. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధీశెట్టి కథానాయిక. యునానిమస్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్‌పోస్టర్‌ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ సినిమా విడుదలకు 30 రోజులు మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్‌ ప్రచార పోస్టర్‌ను విడుదల చేసింది. నాని ఫెరోషియస్‌ క్యారెక్టర్‌లో కనిపించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ ఆకట్టుకుంటున్నాయి. కెమెరా సాను జాన్‌ వర్గీస్‌, సంగీతం మిక్కీ జేమేయర్‌.

➡️