‘తెరచాప’ టీజర్‌ విడుదల

May 6,2025 19:25 #movies, #teaser released, #Terachapa

అనన్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘తెరచాప’. కైలాష్‌ దుర్గం నిర్మాతగా దీనిని నిర్మిస్తున్నారు. జోయల్‌ జార్జ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. నవీన్‌రాజ్‌ శంకరపు, పూజ సుహాసిని, స్త్రీలు ముఖ్య పాత్రల్లో నటించారు. రాజీవ్‌ కనకాల, పృథ్వీరాజ్‌, జగదీష్‌ ప్రతాప్‌ బండారి, ఫిష్‌ వెంకట్‌, అశోక్‌, నాగి, అప్పారావు, రాజేష్‌ భూపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజీమ్‌, వెంకట్‌ సినిమాటోగ్రాఫర్లుగాను, ప్రజల క్రిష్‌; ఎంఎల్‌ రాజా సంగీతాన్ని అందించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో కథానాయకుడు కార్తీక్‌రత్నం, హరికథ దర్శకుడు మ్యాగి ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మ్యాగి మాట్లాడుతూ తెరచాప సినిమాలో మంచి కంటెంట్‌ ఉందన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలుస్తుందన్నారు. టీజర్‌ చాలా బాగా వచ్చిందన్నారు. ప్రొడ్యూసర్‌ కళ్యాణ్‌దుర్గం మాట్లాడుతూ ఈ సినిమాతో మంచి హిట్‌ కొడతామన్నారు.

➡️