కన్నడ నటుడు యష్ చేస్తున్న ‘టాక్సిక్’ చిత్రం నుండి తాజాగా ఓ వీడియో విడుదలైంది. ‘ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. నేషనల్ అవార్డు విన్నర్ మలయాళ దర్శకురాలు గీతూమోహన్ దాస్ ఈ సినిమాకు దర్వకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం యష్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదలచేశారు. ‘టాక్సిక్ బర్త్‌డే పీక్’ అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో యష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.