‘ఒక పథకం ప్రకారం’ సినిమా టైటిల్‌కు రెస్పాన్స్ అయితే అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ఉండే ప్రతి పాత్రకు ఎవరి ప్లానింగ్ వారికి ఉంటుంది. అందుకే ఈ టైటిల్‌ను ఎంపిక చేశాం. దర్శకుడు వినోద్‌కుమార్ అన్నిటి మీద అవగాహన ఉన్న మంచి టెక్నీషియన్. ఆయన దర్శక నిర్మాతగా ఫాహద్ ఫాజిల్‌తో రెండు సినిమాలు నిర్మించారు. మా ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్ వినీత్. వీళ్లిద్దరూ కలిసి తెలుగులో చేద్దామనుకున్నప్పుడు నా పేరును అనుకున్నారు. సముద్రఖని గారితో పనిచేయటం హుందాగా అనిపించింది. ట్రైలర్‌ను అన్నయ్య పూరీ జగన్నాథ్ చూశారు. కొత్తగా ఉందన్నారు. ఈ సినిమాలో నా పాత్ర క్రిమినల్ లాయర్. క్రిమినలా? లేకపోతే క్రిమినల్ లాయరా? అన్నట్లుగా ఉంటుంది’ అని కథానాయకుడు సాయిరామ్ శంకర్ అన్నారు. ఆయన నటించిన ‘ఒక పథకం ప్రకారం’ సినిమా ఈనెల ఏడో తేదీన విడుదల కానుంది. గార్లపాటి రమేష్, వినోద్‌కుమార్ విజయన్ నిర్మించారు. శృతిసోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.
