నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణాలోని నాంపల్లి కోర్టులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారమూ చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ఆదివారమూ స్టేషన్‌కు హాజరు కావడంపై అల్లు అర్జున్‌ మినహాయింపు కోరారు. ఈ మేరకు ఈ నిబంధనను కోర్టు మినహాయించింది. అలాగే, విదేశాలకు వెళ్లేందుకు కూడా అల్లు అర్జున్‌కి కోర్టు అనుమతినిచ్చింది.

➡️