కొత్త డైరెక్టర్లకు ‘ఆర్‌జివి డెన్‌’ పిలుపు

Jun 10,2024 20:22 #Director, #New Movies Updates, #rgv

టాలీవుడ్‌ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఆర్‌జివి డెన్‌ను నిర్మించారు. అక్కడి నుంచే సినిమా కార్యక్రమాలను ఆయన చూస్తూ ఉంటారు. అయితే కొద్దిరోజుల క్రితం ఆయన డెన్‌ నుంచి ఒక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఇండిస్టీలో అడుగుపెట్టాలని చాలామందికి కోరిక ఉంటుంది. ఆసక్తి ఉన్న డైరెక్టర్స్‌, రైటర్స్‌, మ్యూజిక్‌ కంపోజర్స్‌ కావాలంటూ వర్మ ట్వీట్‌ ద్వారా తెలిపారు. అయితే తాజాగా వర్మ తన డెన్‌లోకి అడుగుబెట్టబోయే వారి లిస్ట్‌ను ప్రకటించారు. డైరెక్టర్స్‌గా వర్మ డెన్‌లో అడుగుబెట్టాలని 419 మంది తన వెబ్‌సైట్‌ (https://rgvden.com) ద్వారా నమోదు చేసుకుంటే అందులో 11 మందిని సెలక్ట్‌ చేసి వారి పేర్లను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. వీరందరూ ఈనెల 14న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌కు రావాలని రామ్‌గోపాల్‌ వర్మ పేర్కొన్నారు. ఇదే క్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్లుగా 9మంది ఎంపిక య్యారని తెలిపారు. వీరిలో ఒక్కరు మాత్రమే ఫైనల్‌ అవుతారని, వారిని కూడా ఎలా ఎంపిక చేస్తారనేది వెబ్‌సైట్‌లో వివరించారు. వర్మ డెన్‌కు ఎంపిక అయిన వారందరీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను కూడా వారి పేరు పక్కన చేర్చడం విశేషం. వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌లో ష్ట్ర్‌్‌జూర://తీస్త్రఙసవఅ.షశీఎ లో చూడాలని కోరారు.

➡️