‘రాబిన్‌హుడ్‌’ టీజర్‌ వచ్చేసింది

నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. వెంకీ కుడుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం నుండి చిత్రబృందం టీజర్‌ని విడుదలచేసింది. ఈ టీజర్‌లో నితిన్‌ వివిధ గెటప్‌ల్లో కనిపించారు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నారు. జివి.ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న ఈ సినిమాను డిసెంబర్‌ 25న రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

➡️