సాయి దుర్గ తేజ్ నటిస్తోన్న కొత్త చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రోహిత్ కెపి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇటీవలే ప్రముఖ ఫైట్ మాస్టర్స్ కొరియోగ్రాఫ్ చేసిన 15 రోజుల యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్‌ని ఈ చిత్ర బృందం పూర్తి చేసింది. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.
