Saif Ali Khan: ఆసుపత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్‌ డిశ్చార్జి

ముంబయి : బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీఖాన్‌ మంగళవారం లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ నెల 16న బాంద్రాలోని తన నివాసంలో కత్తిపోట్లకు గురికావడంతో సైఫ్‌ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. షరీఫుల్‌ ఇస్లాం షాజాద్‌గా గుర్తించిన నిందితుడు కత్తితో దాడి చేయడంతో వెన్నెముక, ఛాతీ వంటి ఆరు ప్రదేశాల్లో సైఫ్‌కు గాయాల య్యాయి. 2.5 మిల్లీమీటర్ల కత్తి ముక్కను తొలగించడానికి శస్త్రచికిత్స నిర్వహించారు. మంగళవారం డిశ్చార్జ్‌ సమయంలో సైఫ్‌ సాధారణంగానే కనిపించారు. ఆయన వెంట వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పోలీసు అధికారులు ఉన్నారు. పోలీసు విచారణలో షాజాద్‌ బంగ్లాదేశీయుడని, విజరుదాస్‌ పేరుతో ఇక్కడ హౌస్‌కీపింగ్‌ కంపెనీలో పనిచేస్తున్నాడని వెల్లడయింది. షాజాద్‌కు కోర్టు ఈ నెల 19న ఐదు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది.

సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి

➡️