తెలంగాణ : ” ఇప్పటికీ తమ ప్రేమను ధారపోస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు ” అని హీరోయిన్ సమంత ఇన్‌స్టా స్టోరీస్‌లో రాశారు. తాజాగా ప్రేమ, స్నేహం, బంధం గురించి సమంత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. ” చాలా మంది వ్యక్తులు స్నేహాలు, సంబంధాలను పరస్పరం కొనసాగిస్తారు. వీటిని నేను కూడా అంగీకరిస్తున్నాను. మీరు ప్రేమను పంచుతారు. నేను కూడా తిరిగి ఇస్తాను. కానీ కొన్నేళ్లుగా నేను నేర్చుకున్నది ఏంటంటే.. మనం ప్రేమను పంచే ఎదుటి వ్యక్తి తిరిగి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా ప్రేమను అందజేస్తాం.. ఎందుకంటే ప్రేమ అనేది ఓ త్యాగం. మనకు అవతలి వైపు నుంచి ప్రేమ, ?అప్యాయతలు అందకపోయినా.. ఇప్పటికీ తమ ప్రేమను ధారపోస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు.” అంటూ పోస్ట్ చేసింది.
