Samantha : ‘కష్టసుఖాల్లో నీతో మేమున్నాం’ : సమంత

ఇంటర్నెట్‌డెస్క్‌ : భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ఫొగాట్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడబోయే ముందు ఆమెపై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో తలపడనున్న వినేశ్‌.. ఉండాల్సిన బరువు కన్నా.. వంద గ్రాములు అధిక ఉందన్న కారణంతో ఆమెపై ఒలింపిక్‌ కమిటీ అనర్హత వేటు వేసింది. ఈ నేపథ్యంలో వినేశ్‌కు మద్దతుగా నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా నటి సమంత కూడా సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారు. ‘కొన్నిసార్లు అన్నీ ఎదుర్కోగల బలమైన మనుషులకే కష్టమైన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. నువ్వు ఒంటరిగా లేవనే విషయం మర్చిపోకు. పైన ఉన్నవాడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఇలాంటి కష్టాల మధ్య నిలదొక్కుకునే నీ సామర్థ్యం చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. కష్టాల్లో, సుఖాల్లో నీతో మేము ఉన్నాం’ అంటూ సమంత వినేశ్‌ ఫొగాట్‌కి ధైర్యం చెప్పింది. తనకు మద్దతుగా నిలిచింది.

➡️