సమంత తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జోసెఫ్ మృతికి గల కారణం తెలియలేదు. అనారోగ్య సమస్యలతో చనిపోయినట్లు సమాచారం. ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. దీనికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జతచేశారు. ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆమెకు సానుభూతికి తెలియజేస్తున్నారు. ధైర్యంగా ఉండాలని.. ఆమె తండ్రికి సంతాపం ప్రకటిస్తున్నారు.