‘డబుల్‌ ఇస్మార్ట్‌’తో ఎంజాయ్ చేస్తారు : సంజయ్  దత్‌

Aug 9,2024 19:05 #movie, #sanjaydath

‘తెలుగు సినిమా డైనమిక్స్‌ని మార్చిన తెలుగు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ సార్‌. డబుల్‌ ఇస్మార్ట్‌లో నన్ను భాగం చేసి బిగ్‌బుల్‌ చూపిస్తున్నందు మీకు థ్యాంక్స్‌. రామ్‌తో పనిచేయటంతో చాలా మజా వచ్చింది. డబుల్‌ ఇస్మార్ట్‌ని ఆడియన్స్‌ బాగా ఎంజారు చేస్తారు’ అని బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్‌ అన్నారు. రామ్‌పోతినేని, కావ్యా థాపర్‌ జంటగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. పూరీ జగన్నాథ్‌, ఛార్మీ కౌర్‌ నిర్మించారు. ఈనెల 15న ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ సినిమాను విడుదల చేస్తుంది. మణిశర్మ సంగీతాన్ని అందించారు. ‘బిగ్‌బుల్‌..’ అంటూ సాగే పాటని ముంబైలో జరిగిన ఈవెంట్‌లో విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్‌ సాహిత్యాన్ని అందించారు. ఈ పాటని పృథ్వీ చం, సంజన కల్మంజే పాడారు. ఈ సందర్భంగా రామ్‌ మాట్లాడుతూ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’తో ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు రావటం ఆనందంగా ఉంది. సంజయ్ దత్‌తో పనిచేయటం గౌరవంగా ఉంది’ అని పేర్కొన్నారు. పూరీ జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘సంజయ్ బాబాకి నేను బిగ్‌ ఫ్యాన్‌ని.ఆయన ‘డబుల్‌ ఇస్మార్ట్‌ ‘ చేయటం చాలా హ్యాపీగా ఉంది’ అని అన్నారు. ఈ వేడుకలో ఛార్మీ, కావ్యా థాపర్‌, పూరి కనెక్ట్స్‌ సిఇఒ విష్‌, నటుడు ఆలీ మాట్లాడారు.

➡️