#సిద్దార్థ్40లో శరత్ కుమార్, దేవయాని

Jul 15,2024 18:00 #telugu movies
హీరో సిద్ధార్థ్ తన 40వ సినిమా కోసం బ్లాక్ బస్టర్ టీంతో చేతులు కలిపారు. ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ కు ‘8 తొట్టక్కల్’ ఫేం శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ, శాంతి టాకీస్‌ పై తెలుగు- తమిళ్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ సర్ ప్రైజింగ్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ చిత్రంలో స్టార్ యాక్టర్ శరత్ కుమార్, యాక్ట్రెస్ దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. వీరి క్యారెక్టర్స్ కథలో చాలా క్రూషియల్ గా వుండబోతున్నాయి.
#సిద్దార్థ్40 కోసం డైరెక్టర్ శ్రీ గణేష్‌ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. హై బడ్జెట్, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమా రూపొందబోతోంది.
ఈ చిత్రానికి సంబధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
➡️