స్టేజీపైనే కన్నుమూసిన సతీష్‌జోషి

May 13,2024 21:30 #movie, #sthish joshi

ప్రముఖ నటుడు సతీష్‌ జోషి సోమవారం తుదిశ్వాస విడిచారు. మరాఠీలో పలు సీరియళ్లలో నటించి మంచి నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నా స్నేహితుడు సతీష్‌ జోషి.. మరణానికి ముందు రంగోత్సవ్‌లో వేదికపై నటించారు. ఉదయం 11 గంటలకు చనిపోయారు. అయితే తుదిశ్వాస విడవడానికి ముందు కూడా ఆయన ఎంతో ఎనర్జీతో కనిపించారు’ అని ఆయన స్నేహితుడు రాజేశ్‌ దేశ్‌ పాండే సోషల్‌ మీడియాలో ధ్రువీకరించారు. మరాఠీ సీరియల్‌ ‘భాగ్యలక్ష్మి’లో సతీష్‌ కీలకపాత్ర పోషించారు. ది క్రియేషన్‌ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా రామభూమిలో జరుగుతున్న వేడుకలో పాల్గన్నారు. ఇందులోనే స్టేజీ ఫెర్ఫార్మెన్స్‌ ఇస్తూ తుదిశ్వాస విడిచారు.

➡️