సత్యరాజ్‌ కొత్త చిత్రం పాట విడుదల

Apr 3,2025 21:55 #new movie, #satyaraj, #song released

సత్యరాజ్‌ కీలకపాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకు డైరెక్టర్‌ మారుతి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విజరు పాల్‌ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సత్యం రాజేష్‌, వశిష్ట ఎన్‌ సింహ, సాంచి రారు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్‌ సింగిల్‌ని విడుదల చేశారు. ‘అనగా అనగా కథలా’ అంటూ సాగే ఈ పాటని టీకేఆర్‌ కాలేజీలోని విద్యార్థుల సమక్షంలో చైర్మన్‌ తీగల కృష్ణారెడ్డి రిలీజ్‌ చేశారు. సింగర్‌ కార్తీక్‌ ఈ పాటని ఆలపించారు. సనరే సాహిత్యం అందించారు.

➡️