మళ్లీ సినిమాల్లోకి సాయేషా సైగల్‌

‘అఖిల్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయేషా సైగల్‌ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌కుమార్‌ మనవరాలు. అజరుదేవ్‌గణ్‌తో కలిసి ఆమె నటించిన ‘శివారు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. వివాహం తర్వాత ఆమె సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. ఈమేరకు ఇప్పటికే ఆమె సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. తమిళంలో జయం రవికి జంటగా మనమగన్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా మంచి పేరే వచ్చింది. ఆ చిత్రం తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలొస్తున్నాయి. కారీ, విజరుసేతుపతి, సూర్య, ఆర్యతో పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో నటుడు ఆర్యతో పరిచయం ప్రేమగా మారటంతో ఇరుకుటుంబాల సమ్మతితో పెళ్ళి చేసుకున్నారు. ఆమె మంచి డ్యాన్సర్‌ కూడా. మళ్లీ నటిగా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలో తన భర్త ఆర్యతో కలిసి ఓ చిత్రంలో నటించటానికి సిద్ధమవు తున్నట్లుగా సమాచారం. సాయేషా ఒక వీడియోను తన ఇన్‌స్ట్రా గ్రామ్‌లో పెట్టారు. అందులో ‘గురు’ చిత్రంలోని మైయా మైయా అనే పాటకు స్టెప్పులు వేశారు.

➡️