‘శంబాల’ మేకింగ్‌ వీడియో

ఆది సాయికుమార్‌ నటిస్తున్న ‘శంబాల’ చిత్రం నుండి తాజాగా మేకింగ్‌ వీడియో విడుదలైంది. ఓ మిస్టిక్‌ వరల్డ్‌లో రూపొందుతున్న ఈ సినిమాని యుగంధర్‌ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో ఆది సాయి కుమార్‌ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. రవివర్మ, మీసాల లక్ష్మణ్‌, మధునందన్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ను ప్రకటించనున్నారు.

➡️