జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నామో తెలియజేసే చిత్రం ‘షష్ఠిపూర్తి’. రూపేష్ కథానాయకుడిగా మా ఆయి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘షష్ఠిపూర్తి’. నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, రెండుసార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెల్చుకున్న అర్చన ఇందులో ప్రధాన తారాగణం. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ విడుదలై 38 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. ఆకాంక్షా సింగ్ ఇందులో రూపేష్ సరసన నటిస్తున్నారు. పవన్ ప్రభు దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. ఈ చిత్ర గ్లింప్స్‌ని హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మేకర్లు విడుదల చేశారు.