కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది

Oct 29,2024 18:32 #hero surya, #Jyotika, #new movie

కొంతకాలంగా సూర్య-జ్యోతిక ముంబైలో ఉంటున్నారు. ఈ అంశం గురించి గతంలో పలు రకాలుగా రూమర్స్‌ వచ్చాయి. వారు కుటుంబంతో విడిపోయారంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే, ఈ జంట ముంబైలో ఫ్యామిలీ పెట్టడానికి గల కారణాన్ని ‘కంగువ’ సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమంలో సూర్య చెప్పారు. తమ కుటుంబం కోసం జ్యోతిక చాలా వదులుకొని వచ్చిందని సూర్య అన్నారు. ‘తనకు 18 ఏళ్ల వయసులో చెన్నైకి జ్యోతిక వచ్చింది. మా వివాహం అయిన తర్వాత అందరం కలిసి చెన్నైలోనే ఉన్నాం. నా కుటుంబం కోసం ఆమె చాలా త్యాగాలు చేసింది. ఒకదశలో సినిమా ఛాన్సులు వచ్చినా వదులుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన జ్యోతిక అక్కడ తన స్నేహితులను దూరం చేసుకుంది. అయితే, కోవిడ్‌ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ముంబైకి షిఫ్ట్‌ కావాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఆమె కెరిర్‌ మళ్లీ మొదలైంది. సరికొత్తదనం ఉన్న ప్రాజెక్ట్‌లలో పనిచేస్తోంది. తను ఎప్పుడూ కొత్త దర్శక, నిర్మాతలతో కలిసి పనిచేయాలని ఆలోచిస్తుంది. బాలీవుడ్‌లో ‘శ్రీకాంత్‌’, ‘కాదల్‌- ది కోర్‌’, ‘సైతాన్‌’ వంటి విభిన్నమైన సినిమాల్లో నటించి మెప్పించింది. మహిళలకు అన్ని విషయాల్లో స్వాతంత్య్రం ఇవ్వాలని నేను కోరుకుంటాను. అందరిలా వారికి కూడా స్నేహితులు ఉంటారు. ప్రస్తుతం జ్యోతిక తన కుటుంబంతో పాటు పాత స్నేహితులతో టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలో నేను కూడా రెగ్యూలర్‌గా ముంబై వెళ్తుంటాను. కుటుంబం కోసం ప్రతి నెలలో పదిరోజులకు పైగానే కేటాయిస్తాను.’ అని ఆయన మాట్లాడారు.

➡️