నిర్మాతగా శింబు!

Feb 5,2025 20:18 #movies, #producer, #Simbu

కోలీవుడ్‌ నటుడు శింబు, నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నాడు. ఆత్మన్‌ సినీ ఆర్ట్స్‌ పేరుతో ప్రొడక్షన్‌ హౌజ్‌ స్టార్ట్‌ చేసిన ఈ నటుడు, తన 50వ సినిమాను స్వీయ బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. కమల్‌ హాసన్‌ బ్యానర్‌ రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై శింబు హీరోగా ‘కనులు కనులు దోచాయంటే’ ఫేం దేశింగు పెరియసామితో ఓ సినిమా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు నుంచి కమల్‌ తప్పుకున్నారు. దీంతో సినిమా బాధ్యతలను శింబు తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌ కావడంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో తనే ప్రొడ్యూసర్‌గా మారిపోయాడని సమాచారం.

➡️