శ్రీ స్వర్ణ వరల్డ్ మూవీస్ బ్యానర్‌పై బి.నాగవర్థిని సమర్పణలో మూర్తీ నం.1 కథానాయకుడుగా ద్విపాత్రాభినయంతో తెరకెక్కిన సినిమా ‘శివంగి’. ఇందులో ఆయన తండ్రీ కొడుకులుగా నటించారు. వెంకీ, దివ్యశ్రీ, రాజశ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా లక్ష్మణ్‌చౌదరి, బొబ్బిలి విజయ్, పందిరికృష్ణ, తిలక్, దివ్యశ్రీ, కుంచనపల్లి మౌనిక,పొట్టి చిట్టిబాబు, పలాసా శ్రీను, తోపాటుగా కోట శంకరరావు, చిత్రం శ్రీను, సురేష్ బాందేపురపు, కనకదుర్గ, డబుల్ ఎక్స్ శివ, గడ్డం శివ, వై.పవన్‌కుమార్, రెహ్మాన్ (పొన్నూరు), వడ్డీశ్వరం కుమార్, విఆర్‌ఒ రామారావు, రాణి, నాగేశ్వరరావు, రామతీర్థ, జెన్నీ నటించారు. కెమెరామెన్ పిఎన్ రమేష్, కొరియోగ్రఫీ ఎస్‌కె ఖాదర్-ఫణీంధ్ర కుమార్, సంగీతం చురువేళ్ల రవికుమార్, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం మూర్తి బాందేపురపు. ఈనెల 21న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. యాక్షన్, కామెడీ, హర్రర్ నేపథ్యంలో కథ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుందని నిర్మాత మూర్తి నం.1 తెలిపారు. తమ సినిమాను ఆదరించి బ్లాక్‌బస్టర్‌గా నిలపాలని కోరారు.
