టాలీవుడ్‌కు చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్, దర్శకురాలు, నిర్మాత శ్రీజ సాదినేనికి హైదరాబాద్‌లో ఘన సత్కారం జరిగింది. ఇటీవల ఆమె చంద్రన్న సేవారత్న పురస్కారం అందుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు సినీరంగ ప్రముఖులు ఆమెను ఘనంగా సత్కరించి అభినందించారు. సినీ, రంగస్థల నటిగా, దర్శకురాలిగా శ్రీజ రాణిస్తూ తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తనవంతుగా కృషిచేస్తున్నారని పొలపల మల్లికార్జున మెమోరియల్ ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు, దర్శకులు పసుపులేటి వెంకటరమణ అన్నారు.
