‘ట్రైన్‌’ కోసం ‘శ్రుతి’ గానం

Jul 19,2024 19:30 #movie, #Vijay Sethupathi

తమిళ సినీనటుడు విజయ్ సేతుపతి నటించిన చిత్రం ‘ట్రైన్‌’. నటి డింపుల్‌ హైయతీ కథానాయిక. ఆర్‌.దయానంద, నాజర్‌, దర్శకుడు కెఎస్‌ రవికుమార్‌, వినయ్ రారయ్, భావన, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వి క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. మిష్కిన్‌ దర్శకత్వంతోపాటుగా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాలుగుపాటలున్నాయి. అందులో ఒక పాటను మిష్కిన్‌ పాడారు. మరో పాటను శ్రుతిహాసన్‌ పాడటానికి అంగీకరించారు.

➡️