శ్యాంప్రసాద్‌రెడ్డికి సతీవియోగం

Aug 8,2024 19:24 #movie, #Shyamprasad Reddy wife

ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత శ్యాంప్రసాద్‌రెడ్డికి సతీ వియోగం కల్గింది. ఆయన సతీమణి వరలక్ష్మి (62) బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగాయి. వరలక్ష్మి మృతికి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. తెలుగు ఇండిస్టీలో నిర్మాతగా గుర్తింపుపొందిన శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ స్థాపించి పలు సీరియళ్లతోపాటుగా టీవీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి వంటి హిట్‌ సినిమాలను నిర్మించారు.

➡️