హీరో, హీరోయిన్లు మక్కా శ్రీను, సుచిత్ర రాధోడ్ నటించిన చిత్రం ‘ఎస్‌ఐ కోదండపాణి’. శ్రీ సాయి హనుమాన్ మూవీ పతకాంపై మక్కా శ్రీదేవి నిర్మించారు. ఈప్రమోషన్ కార్యక్రమాలను చిత్రబృందం వేగం చేసింది. ఈ సందర్భంగా హీరో మక్కా శ్రీను మాట్లాడుతూ త్వరలోనే ‘ఎస్‌ఐ కోదండపాణి’ సినిమాను సుమారు 150 థియేటర్లలో విడుదల చేయబోతున్నామన్నారు. క్లాస్, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అన్ని అంశాలూ మేళవించి ఈ సినిమాను తీశారన్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. హీరోయిన్ సుచిత్ర రాధోడ్ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా తన కెరీర్ ప్రారంభమయ్యిందన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందన్నారు. పోస్ట్‌ప్రొడక్షన్స్, సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
