శ్రీ సాయి హనుమాన్ మూవీ పతాకంపై మక్కా శ్రీదేవి నిర్మాణ సారధ్యంలో మక్కా శ్రీను హీరోగా, సుచిత్ర రాథోడ్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఎస్‌ఐ కోదండపాణి’. శుక్రవారంనాడు ఈ సినిమా థియేటర్లలో విడుదలకానుంది. దిల్ రమేష్, ఎజిఎం శ్రీనివాస్, సూరినాయుడు, టిక్‌టాక్ సూరిబాబు, స్వర్ణ (జూనియర్ శకుంతల), షరీఫ్, నాగు, రమేష్, మణిమంఠ, నందిని, సీత, దివ్య, అనూష, నాగేంద్ర రెంటాల ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకత్వం రెంటా నాగేంద్ర, కెమెరా సబరి, సంగీతం సాల్మన్‌రాజు, ఫైట్స్ కోడి రాము, అభి, ఆర్ట్ డైరెక్టర్ రమేష్, ఎడిటర్‌గా ఉదరు వ్యవహరించారు.
