హీరోగా మక్కా శ్రీను, హీరోయిన్‌గా సుచిత్ర రాధోడ్ నూతన పరిచయంతో నిర్మితమైన సినిమా ‘ఎస్‌ఐ కోదండపాణి’. శ్రీ సాయి హనుమాన్ మూవీ పతకాంపై మక్కా శ్రీదేవి నిర్మిస్తున్నారు. దిల్ రమేష్, ఏజీఎం శ్రీనివాస్, సూరినాయుడు, టిక్ టాక్ సూరిబాబు, స్వర్ణ షరీఫ్, నాగు, రమేష్, మణికంఠ, నందిని, దివ్య, అనూష, నాగేంద్ర రెంటాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఫిలిం చాంబర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రీమియర్ షోకు నటీనటులంతా హాజరయ్యారు. నూతన దర్శకుడు రెంటాల నాగేంద్ర ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని మేకర్లు ప్రకటించారు. ముఖ్య అతిథులుగా లయన్ సాయి వెంకట్, దర్శకుడు, హీరో కళ్యాణ్ రాజ్ హాజరయ్యారు.
