నందమూరి కళ్యాణ్‌రామ్ నటుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్‌కెఆర్ 21’ (వర్కింగ్ టైటిల్). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. విజయశాంతి, శ్రీకాంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు సోహైల్‌ఖాన్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. సోహైల్ పుట్టినరోజు సందర్భంగా ఎన్‌కెఆర్ చిత్ర యూనిట్ ఆయన చేస్తున్న పాత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ‘సోహైల్ ఖాన్, కళ్యాణ్‌రామ్ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరా బాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగు తోంది. కళ్యాణ్‌రామ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ ముప్పా వెంకయ్య చౌదరి, సంగీతం అజనీష్ లోక్‌నాథ్, కెమెరా రామ్‌ప్రసాద్.
