హైదరాబాద్ : కరోనా సమయంలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసి.. సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నారు. తాజాగా ఆయన ‘ఫతే’ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సోనూసూద్ తాజాగా హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో బాగా ఫేమస్ అయిన కుమారి ఆంటీని కలిశాడు. ఆమెను సన్మానించాడు. ఈ సందర్బంగా సోనూసూద్ మాట్లాడుతూ.. ‘కుటుంబాల కోసం స్త్రీలు ఎంత కష్టపడుతున్నారనేది కుమారి ఆంటీ సజీవ సాక్ష్యం. ఎవరి కుటుంబాలైతే ఇబ్బందుల్లో ఉన్నాయో వాళ్లు కుమారి ఆంటీని చూసి నేర్చుకోవాలి. ఇబ్బందుల్లో కూడా సరైన దారి ఎంచుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు అని కుమారి ఆంటీ నిరూపించింది. ఆమె పడిన కష్టమే తనను ఈ స్థాయికి తెచ్చింది. వుమెన్ ఎంపవర్మెంట్‌కి నిజమైన అర్థం ఇదే.’ అని అన్నాడు.
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌లో తాను భోజనం చేస్తానని.. కేవలం వెజిటేరియల్‌నే తింటానని, ప్లేట్ మీల్స్ ఎంత అని సోనూసూద్ కుమారీ ఆంటీని అడిగాడు. ఆమె 80 రూపాయలు అని చెప్పింది. అప్పుడు తనకి ఎంత డిస్కౌంట్ ఇస్తారు అని అడిగితే.. ఆమె మీకైతే ఫ్రీగానే పెడతానని చెప్పుకొచ్చింది. అయితే నాకు లాటరీ తగిలింది ఫ్రీగా పెడతానంటే రోజూ వస్తానని సోనూసూద్ అంటే.. మీరు ఎంతోమందికి సాయం చేశారు. మీకు మేము ఎంత పెట్టినా తక్కువే అని కుమారీ ఆంటీ చెపకొచ్చింది. ఇక కుమారి ఆంటీని సన్మానించిన తర్వాత ఆమె కుమార్తె యామిని, కుమారుడు ధనుష్‌తో కలిసి సోనూసూద్ ఫొటోలు దిగారు.
