త్వరలో ‘గోదారి గట్టు మీద’ పాట విడుదల

హీరోగా వెంకటేష్‌, హీరోయిన్లుగా మీనాక్షిచౌదరి, ఐశ్వర్యారాజేష్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం…’. వెంకటేష్‌, సంగీత దర్శకుడు రమణ గోగుల కాంబినేషన్‌లో ‘లక్ష్మి’ సినిమా వచ్చింది. ఈ సినిమాకు రమణగోగుల ఇచ్చిన సంగీతం అప్పట్లో బాగా పేరు తెచ్చిపెట్టింది. 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం…’ సినిమాకు చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ‘గోదావరి గట్టుమీద’కు తన వాయిస్‌ని అందించారు. ఎఫ్‌ 2, ఎఫ్‌ 3 వంటి చిత్రాల తర్వాత వెంకటేష్‌, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఇదే. ‘దిల్‌’రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శిరీష్‌ నిర్మిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. తొలి పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. రెగ్యులర్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌తో కాకుండా పెక్యులియర్‌ వాయిస్‌తో ఈ పాట పాడించాలని అనిల్‌ రావిపూడి చెప్పారని చిత్ర యూనిట్‌ పేర్కొంది. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తామని తెలిపింది.

➡️