సెప్టెంబర్‌ 5,6 తేదీల్లో అబుదాబిలో దక్షిణ భారత సినిమా వేడుకలు

Apr 3,2024 19:20 #movie

దక్షిణ భారతీయ సినిమా వైభవ ఉత్సవాం2024 వచ్చే సెప్టెంబర్‌ 6, 7 తేదీల్లో అబుదాబిలోని యాస్‌ ఐలాండ్‌లో జరగనుంది. దక్షిణ భారత సినిమాల్లోని అపారమైన ప్రతిభ, వైవిధ్యాన్ని ప్రదర్శించటానికి గాను ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా యాస్‌ ఐలాండ్‌ నిలుస్తుంది. షేక్‌ సహాయన్‌ మబారక్‌ అల్‌ నహ్యాన్‌ (టాలరెన్స్‌ అండ్‌ కో ఎక్సిస్టెన్స్‌ మంత్రి) ప్రోత్సాహంతో ఈ ఉత్సవం జరగనుంది. అద్భుతమైన ప్రదర్శనలు, ఉత్తమ చిత్రాలకు అవార్డుల బహుకరణలు ఉంటాయి. ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయటానికి అబుదాబీ సాంస్క ృతిక, పర్యాటకశాఖ, అక్కడి పర్యాటక సంస్థలు, మిరల్‌ భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చలనచిత్ర పరిశ్రమల్లోని గొప్ప ప్రతిభ, సృజనాత్మకత, కథనాలను ప్రపంచ ప్రేక్షకుల ముందు ప్రదర్శించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పరిశ్రమల నుంచి తారల నుంచి అంతర్జాతీయ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, ప్రపంచవ్యాప్తంగా సినీ ఔత్సాహికులంతా ఒకేచోట కలవబోతున్నారు. అర్థవంతమైన కనెక్షన్లు, భాగస్వామ్యాలను పెంపొందించటం, నెట్‌వర్కింగ్‌ కోసం సహకారం, ప్రపంచవ్యాప్తంగా వినోదానికి అందమైన ఆకృతి లక్ష్యాలకు ఈ ఉత్సవాలు జరగబోతున్నాయని ఐఐఎఫ్‌ఎ వ్యవస్థాపకుడు, దర్శకుడు ఆండ్రీ టిమ్మిన్‌ తెలిపారు. మిరాల్‌ గ్రూప్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ డెస్టినేషన్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తగ్రిద్‌ అల్‌ సయీద్‌ తెలిపారు. ఈ వేడుకలకు హాజరయ్యేవారు తమ పేర్లు ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించారు.

➡️