‘దక్షిణ’ ట్రైలర్‌ విడుదల

May 15,2024 19:08 #New Movies Updates, #triler

కబాలి ఫేమ్‌ సాయి ధన్షిక ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘దక్షిణ’. ఓషో తులసి రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కల్ట్‌ కాన్సెప్ట్స్‌ మూవీ బ్యానర్‌పై అశోక్‌ షిండే నిర్మిస్తున్నారు. రిషవ్‌ బసు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్‌ బుచ్చిబాబు సనా విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ బుచ్చిబాబు మాట్లాడుతూ ‘ఈ మధ్య కాలంలో నన్ను బయపెట్టిన ట్రైలర్‌ ఇదే. తులసి రామ్‌ టాలీవుడ్‌కి మరో ట్రెండ్‌ సెట్టర్‌. దక్షిణ సినిమాతో సైకో థ్రిల్లర్‌ను ఇవ్వబోతున్నారు’ అంటూ అభినందించారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు చిత్రబృంద సభ్యులు కూడా పాల్గొన్నారు.

➡️