స్పెషల్‌ సాంగ్‌!

Apr 12,2024 19:10 #hruthik roshan, #movie

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్‌ 2’ చిత్రం నుండి తాజాగా ఒక ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. హృతిక్‌, ఎన్టీఆర్‌ కాంబోలో ఓ పాట చిత్రీకరణ చేయబోతున్నారని సమాచారం. అయాన్‌ ముఖర్జీ డిజైన్‌ చేసిన ఈ స్పెషల్‌ సాంగ్‌ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘వార్‌’ ఫస్ట్‌ పార్టులో హృతిక్‌, టైగర్‌ ష్రాఫ్‌ కాంబోలో ఇలాంటి సాంగ్‌ పెట్టారు. ఈ సారి ‘వార్‌ 2’లో రాబోయే పాట నెక్ట్స్‌ లెవల్‌లో ఉండబోతుందని బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ స్టూడియోలో 10 రోజుల పాటు షూటింగ్‌ కొనసాగనుంది. ఈ చిత్రాన్ని 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

➡️