శ్రీశ్రీశ్రీ రాజా వారు సెన్సార్‌ పూర్తి

Jun 10,2024 19:16 #New Movies Updates

జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నార్నె నితిన్‌, సంపద హీరో హీరోయిన్లుగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ శ్రీ శ్రీ శ్రీ రాజా వారు. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. శ్రీ వేధాక్షర మూవీస్‌ పతాకంపై నార్నె నితిన్‌, సంపద హీరో హీరోయిన్లుగా శతమానంభవతి సినిమాను తీసిన విషయం తెలిసిందే. శ్రీశ్రీ రాజావారు సినిమాను నిర్మాత చింతపల్లి రామారావు తెరకెక్కిస్తున్నారు. చింతపల్లి రామారావు మాట్లాడుతూ ‘శ్రీశ్రీశ్రీ రాజావారు చిత్రంలో అన్ని కమర్షియల్‌ అంశాలు ఉన్నాయి. సతీష్‌ వేగేశ్న మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్‌గా పేరుంది. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఎంటర్‌ టైన్‌ చేస్తుందనే నమ్మకం ఉంది. ఇటీవలే సెన్సార్‌ సభ్యుల ప్రశంసలతో ఖ A సర్టిఫికెట్‌ పొందడం సంతోషంగా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’ అని వివరించారు. రావు రమేష్‌, నరేష్‌, రఘు కుంచె, ప్రవీణ్‌, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్‌, జబర్దస్త్‌ నాగి తదితరులు నటించారు.

➡️