‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవటం ఖాయం. టైటిల్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. చంటబ్బాయి గారి తాలూకా అనే ట్యాగ్ పెట్టడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి ఇన్వెస్టిటేషన్ థ్రిల్లర్స్ తెలుగులో చాలా తక్కువగా వస్తున్నాయి. మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉంటేనే ఇలాంటి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వెళ్తాయి.’ అని దర్శకుడు యదు వంశీ అన్నారు. వెన్నెల కిశోర్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. ప్రచారంలో భాగంగా గురువారంనాడు టీజర్‌ను యదు వంశీ ఆవిష్కరించి మాట్లాడారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కథానాయికలు.