జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విడుదలవుతున్న వేళ సినిమా ప్రచార పోస్టర్ల వ్యవహారం కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖపట్నం రామా టాకీస్ థియేటర్ వద్ద సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను జన జాగరణ సమితి నాయకులు దేవర సినిమా పోస్టర్లపై అతికించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతునివ్వాలని కోరుతూ ఈ ప్రచారం చేపట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్ళేందుకు ఈ ప్రచార పోస్టర్లు అతికించినట్లుగా సభ్యులు వెల్లడించారు.
