కొత్త సినిమాకు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ప్లాన్‌

Jun 15,2024 19:10 #movie, #steven speel burge

‘ది ఫాబెల్‌మ్యాన్స్‌’ (2022) చిత్రం తర్వాత హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తదుపరి చిత్రం గురించి ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, హాలీవుడ్‌ నటి ఎమిలీ బ్లంట్‌ లీడ్‌ రోల్‌లో ఆయన ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు. దీని గురించి ఎమిలీతో ఇప్పటికే చర్చించారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఓ వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను 2026 వేసవిలో విడుదల చేయాలనేది స్పీల్‌బర్గ్‌ ప్రణాళిక అని అంటున్నారు.

➡️