శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్త్రీ 2’. ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం ట్రెండింగ్‌తో మంచి ఆదరణ చూరగొంటోంది. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్‌లో హిట్‌టాక్ అందుకుంది. 2018లో విడుదలైన ‘స్త్రీ’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ వచ్చింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) చూసే అవకాశం ఉంది. ఓ ప్రత్యేక పాటలో తమన్నా స్టెప్పులేశారు. అక్షరు కుమార్ అతిథి పాత్రలో కనిపించటం ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
