చంద్రబాబుకు సుధీర్‌బాబు శుభాకాంక్షలు

హీరో మహేష్‌ బాబు బావమరిది, నటుడు సుధీర్‌ బాబు తెలుగు దేశం పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈనెల 12న ఆయన సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. గుంటూరు మాజీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్‌ తన తోడల్లుడు అయిన సుధీర్‌ బాబుని తీసుకొని చంద్రబాబు దగ్గరికి వెళ్లి అతన్ని పరిచయం చేశారు. తన రాబోయే చిత్రం ‘హరోం హర’లో సుధీర్‌ బాబు సుబ్రహ్మణ్యం పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ కూడా ఈమధ్యనే విడుదలైంది, ఈ సినిమా ఈనెల 14న విడుదలవుతోంది.

➡️